వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే
అనకాపల్లికి ఖరారు కాని అభ్యర్థి
అమరావతి – వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు గాను 24 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఒక్క అనకాపల్లి ఎంపీ సీటు మాత్రం ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు.
ఇదిలా ఉండగా ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం లోక్ సభ స్థానానికి బొత్స ఝాన్సీ, శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్ , విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్ ను ప్రకటించారు జగన్ రెడ్డి.
కాకినాడ ఎంపీ స్థానానికి సునీల్ , అరకు నుంచి తనూజా రాణఙ, అమలాపురం నుంచి రాపాక వర ప్రసాద్ , రాజమండ్రి నుంచి గూడూరి శ్రీనివాసులు, నర్సాపురం ఉమ బాలను ఎంపిక చేశారు. ఏలూరు లోక్ సభ స్థానానికి కారుమూరి సునీల్ కుమార్ , మచిలీపట్నం నుంచి చంద్రశేఖర్ రావుకు ఛాన్స్ ఇచ్చారు.
విజయవాడ నుంచి సిట్టింగ్ ఎంపీ గా ఉన్న కేశి నేని నానికి ఇవ్వగా గుంటూరు స్థానాన్ని కిలారి వెంకట రోశయ్యకు కట్ట బెట్టారు. నర్సరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్ , బాపట్ల నుంచి నందిగాం సురేష్ , ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనూహ్యంగా సీట్లను కట్టబెట్టారు జగన్ రెడ్డి.
ఇక నెల్లూరు నుంచి సిట్టింగ్ ఎంపీ , వైసీపీ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డికి దక్కగా తిరుపతి నుంచి గురుమూర్తి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, కడప నుంచి అవినాష్ రెడ్డి, కర్నూలు నుంచి రామయ్య, నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి, హిందూపూర్ నుంచి శాంత, అనంతపురం నుంచి శంకర నారాయణకు ఛాన్స్ ఇచ్చారు ఎంపీగా.