Monday, April 21, 2025
HomeNEWSANDHRA PRADESHచంద్ర‌బాబు రూ. 931 కోట్లు ఎక్క‌డివి..?

చంద్ర‌బాబు రూ. 931 కోట్లు ఎక్క‌డివి..?

నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు వైసీపీ అధికార ప్ర‌తినిధి పుత్తా శివ శంక‌ర్ రెడ్డి. దేశంలో కెల్లా అత్యంత సంప‌న్న‌మైన సీఎంగా రూ. 931 కోట్ల‌తో నిల‌వ‌డంపై స్పందించారు. ఇన్ని కోట్లు ఎలా వ‌చ్చాయో చెప్పాల‌న్నారు. ఏం క‌ష్టం చేస్తే ఇన్ని ఆస్తులు పోగేసుకున్నారో జ‌నం నేర్చుకుంటున్నార‌ని పేర్కొన్నారు .

దేశ వ్యాప్తంగా ప్ర‌క‌టించిన సీఎంల ఆస్తుల జాబితాలో టాప్ లో నిలిచారు చంద్ర‌బాబు నాయుడు. వీటిని ప్ర‌క‌టించింది ఢిల్లీకి చెందిన సంస్థ ఏడీఆర్. ఇత‌ర ముఖ్య‌మంత్రుల ఆస్తులు చంద్ర‌బాబు ఆస్తుల‌లో స‌గం కూడా లేవ‌న్నారు.

విచిత్రం ఏమిటంటే హెరిటేజ్ ఆస్తులు ఒక్కోరోజులోనే , కేవ‌లం ఒకే ఒక్క గంట‌లోనే రూ. 430 కోట్లు పెర‌గ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు వైసీపీ నేత పుత్తా శివ శంక‌ర్ రెడ్డి. చంద్రబాబు చెప్పిన సంప‌ద సృష్టి ఇదేనంటూ ఎద్దేవా చేశారు.

ఆ సంపద పేదలకు, రాష్ట్రానికి కాదు…దేశంలోనే సంపన్నుడిగా తాను మారటానికి మాత్ర‌మేనంటూ పేర్కొన్నారు. చేతికి వాచీ లేదు, ఉంగరం లేదు…పాలు కూరలు అమ్ముకుంటున్నానని బీద అరుపులు అరిచే చంద్రబాబు ఆస్తి మార్కెట్ వాల్యూ లక్షకోట్లు పైనే ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments