NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ ను ప‌రామ‌ర్శించిన బుగ్గ‌న

Share it with your family & friends

దాడి త‌ర్వాత క‌లిసిన ఆర్థిక మంత్రి

అమరావ‌తి – ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఇటీవల సీఎం జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో మంత్రి సోమవారం సీఎంను కలిసి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

కేసరపల్లిలో ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంగణంలో సమావేశమై జ‌గ‌న్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. 15వ రోజు ‘మేమంతా సిద్ధం’ యాత్రకు సీఎం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో బస్ లోనే సీఎంను మంత్రి బుగ్గన కలిశారు.

అంతులేని ప్రజాదరణ కలిగిన ప్రజా నాయకుడికి ఎన్ని కుట్రలు పన్నినా ఏమీ కాదని ముఖ్యమంత్రితో అన్నారు. రాళ్ల దాడి ఘటనతో జ‌గ‌న్ రెడ్డికి తగిలిన ప్రతిపక్షాల దిష్టి తొలగి పోయిందన్నారు రాజేంద్ర నాథ్ రెడ్డి. నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ కూట‌మి నేత‌ల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఇది ప్ర‌జాస్వామ్యంలో మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

త‌మంత‌కు తాముగా రాళ్ల దాడి చేయించు కోర‌ని, అది కుట్ర‌లు, కుతంత్రాల‌కు పాల్ప‌డే వారికే చెల్లుబాటు అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి.