మొత్తం ఐదుగురు పార్టీ నుంచి అవుట్
అమరావతి – వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్ రెడ్డికి పంపించారు. ఇదిలా ఉండగా పార్టీ అధికారానికి దూరం కావడంతో పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో నలుగురు గుడ్ బై చెప్పారు. వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. వీరితో పాటు రాజశేఖర్ కూడా చేరారు. దీంతో శాసన మండలిలో మొత్తం ఐదుగురు ఎమ్మెల్సీలను కోల్పోయింది వైసీపీ.
మరో వైపు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయ సాయి రెడ్డి సైతం తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాలను విస్తు పోయేలా చేసింది. మరో వైపు అధికారంలో ఉన్న కూటమి సర్కార్ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ప్రధానంగా మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నానని, అందులో ఉన్న వారంతా శిక్షకు గురి కావల్సిందేనంటూ పేర్కొన్నారు. వైసీపీ పవర్ లో ఉన్న సమయంలో తమ వారిని నానా రకాలుగా చిత్రహింసలకు గురి చేశారంటూ ఆరోపించారు.
ఈ తరుణంలో ఇప్పటికే జైలు పాలయ్యారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు నటుడు పోసాని కృష్ణమురళి.