కీలక అంశాలపై చర్చించామన్న ఎంపీ
న్యూఢిల్లీ – వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి మర్యాద పూర్వకంగా ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ ట్రబుల్ షూటర్ అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాల గురించి చర్చించినట్లు ఈ సందర్బంగా ఎంపీ తెలిపారు.
ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో రోజు రోజుకు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్ గా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
ఈ విషయం గురించి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే తమ పార్టీ చేపట్టిన ధర్నాకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని, వారు కూడా ఏపీలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల గురించి ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి.