NEWSANDHRA PRADESH

ఉచిత ఇసుక పేరుతో స‌ర్కార్ మోసం

Share it with your family & friends

వైసీపీ ఆధ్వ‌ర్యంలో జ‌నం ఆందోళ‌న

నెల్లూరు జిల్లా – ఏపీ స‌ర్కార్ ఉచిత ఇసుక పాల‌సీ పేరుతో మోసం చేస్తోందంటూ వైసీపీ ఆధ్వ‌ర్యంలో నెల్లూరులో నాయ‌కులు, ప్ర‌జ‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. న‌గ‌రంలో భారీ ర్యాలీ చేప‌ట్టారు. ఉచిత ఇసుక ఇస్తామంటూ జ‌నాన్ని మోసం చేశారంటూ మండిప‌డ్డారు. మోస పూరిత‌మైన హామీలు ఇచ్చి ద‌గా చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

హామీ ఇచ్చి, మోసం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ధర్నాకు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపారు ప్రజలు. నెల్లూరు నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

ఉచిత ఇసుక అందించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది ఈ భారీ ర్యాలీ. ఈ ర్యాలీలో పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వేలాదిగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

ఇక నుంచి ఉచిత ఇసుక పాల‌సీ పేరుతో మోసం చేయొద్దంటూ కోరారు. రాబోయే రోజుల్లో మ‌రిన్ని ఆందోళ‌న‌లు చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.