బహరంపూర్ లో నాదే గెలుపు
యూసుఫ్ పఠాన్ కామెంట్
పశ్చి మ బెంగాల్ – భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) తరపున యూసుఫ్ పఠాన్ బరిలో నిలిచారు. బహరంపూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు.
ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సైతం పర్యటించారు . టీఎంసీ చీఫ్ , సీఎం మమతా బెనర్జీని ఏకి పారేశారు. ఈ సందర్బంగా యూసుఫ్ పఠాన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఎవరి అంచనాలు వారికి ఉన్నాయని, కానీ తాను మాత్రం గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చు కోలేదన్నారు. తాను తప్పకుండా గెలవ బోతున్నానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు యూసుఫ్ పఠాన్.