Thursday, April 3, 2025

చాహ‌ల్ ధ‌న‌శ్రీ‌కి విడాకులు మంజూరు
కీల‌క తీర్పు చెప్పిన ఫ్యామిలీ కోర్టు

ముంబై – ప్ర‌ముఖ భార‌త క్రికెటర్ యుజ్వేంద్ర చాహ‌ల్ , ధ‌న‌శ్రీ వ‌ర్మ‌కు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఇక నుంచి భార్య భ‌ర్త‌లుగా ఉండ‌లేర‌ని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 5న ఈ ఇద్ద‌రు కోర్టులో విడాకుల పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ విష‌యాన్ని చాహ‌ల్ త‌ర‌పు న్యాయ‌వాది నితిన్ కుమార్ గుప్తా వెల్ల‌డించారు. కోర్టు ఈ ఇద్ద‌రికీ విడాకుల డిక్రీని మంజూరు చేసింద‌ని చెప్పారు. కోర్టు రెండు పార్టీల ఉమ్మడి పిటిషన్‌ను అంగీకరించింద‌న్నారు. చాహల్ , ధ‌న‌శ్రీ‌ వర్మ డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్నారు.

వారు ఇద్ద‌రు ద‌ర‌ఖాస్తు చేసుకున్న ప్ర‌కారం గ‌త జూన్ 2022లో విడి పోయారు. ఆ త‌ర్వాత ప‌రస్ప‌ర అంగీకారంతో విడాకులు కావాల‌ని కోరుతూ కోర్టులో ఉమ్మ‌డి దావా దాఖ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా చాహల్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నందున అతను తరువాత అందుబాటులో ఉండలేడనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని, గురువారం నాటికి విడాకుల పిటిషన్‌ను నిర్ణయించాలని బాంబే హైకోర్టు బుధవారం కుటుంబ కోర్టును అభ్యర్థించింది. త‌ను ఈసారి పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments