Friday, May 9, 2025
HomeSPORTSచాహ‌ల్ భ‌ళా చెన్నై కింగ్స్ విల‌విల

చాహ‌ల్ భ‌ళా చెన్నై కింగ్స్ విల‌విల

4 వికెట్ల తేడాతో పంజాబ్ ఘ‌న విజ‌యం

పంజాబ్ బౌల‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ను శాసించాడు. ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో చెన్నై వేదిక‌గా ఐదో ఓట‌మి చ‌వి చూసింది. చెన్నై ప‌త‌నాన్ని శాసించాడు. ఒకే ఓవ‌ర్ లోయ 36 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. స‌మిష్టి ఆట తీరుతో పంజాబ్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చెన్నై నిర్దేశించిన టార్గెట్ 191 ను 19.4 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ అయ్య‌ర్ దంచి కొట్టాడు. స్వంత గ‌డ్డ‌పై వ‌రుస‌గా ఇది ఐదో ఓట‌మి కావ‌డం విశేషం. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించింది.

అనంత‌రం మైదానంలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ సూప‌ర్ షో చేసింది. కెప్టెన్ అయ్య‌ర్ 41 బంతులు ఆడి 72 ర‌న్స్ చేశాడు. 5 ఫోర్లు 4 సిక్స్ లు ఉన్నాయి. ప్ర‌భ్ సిమ్ర‌న్ సింగ్ 36 బాల్స్ లో 5 ఫోర్లు 3 సిక్సులు కొట్టాడు. సీఎస్కే బౌల‌ర్లు ప‌తిర‌ణ 45 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీయ‌గా ఖ‌లీల్ 28 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చెన్నై 19.2 ఓవ‌ర్ల‌లో 190 ర‌న్స్ చేసింది. సామ్ క‌ర‌న్ 47 బంతులు ఆడి 88 ర‌న్స్ చేశాడు. 9 ఫోర్లు 4 సిక్స్ లు కొట్టాడు. బ్రెవిస్ 32 ర‌న్స్ చేశాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ద‌క్కింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments