SPORTS

ఐపీఎల్ లో టాప్ యుజ్వేంద్ర చాహ‌ల్

Share it with your family & friends

అత్య‌ధిక వికెట్లు తీసిన స్పిన్ బౌల‌ర్

ముంబై – ఐపీఎల్ మెగా వేలం పాట‌లో స్పిన్ బౌల‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. ప్రీతి జింటా యాజ‌మాన్యం పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ రూ. 18 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. క్రికెట్ అభిమానులు, విశ్లేష‌కుల‌ను విస్మ‌యానికి గురి చేసింది. కానీ ఐపీఎల్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల‌లో త‌ను కూడా ఒక‌డు కావ‌డం విశేషం.

త‌ను ఐపీఎల్ లో ముంబై ఇండియ‌న్స్ , రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల త‌ర‌పున ఆడాడు. ఆర్సీబీ జ‌ట్టు త‌ర‌పున ఎక్కువ వికెట్లు తీసిన బౌల‌ర్ గా ఉన్నాడు యుజ్వేంద్ర చాహ‌ల్. ఆ జ‌ట్టు త‌ర‌పున 113 మ్యాచ్ ల‌లో 22.03 స‌గ‌టుతో 139 వికెట్లు తీశాడు. ఇందులో 25 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

2022లో రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టులో చేరాడు. ఇప్ప‌టి దాకా మూడు సీజ‌న్ల‌లో రెండు సార్లు ప్లే ఆఫ్ కు చేరుకుంది ఆ జ‌ట్టు. ఇలా చేరుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు యుజ్వేంద్ర చాహ‌ల్. అతను 160 మ్యాచ్‌లలో 22.44 సగటుతో 5/44తో 205 వికెట్లు సాధించాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తొలి సీజన్ 17 మ్యాచ్‌లలో 19.51 సగటుతో 27 వికెట్లు సాధించాడు. 5/40 అత్యుత్తమ గణాంకాలతో సాధించాడు.