SPORTS

చాహ‌ల్ క‌మాల్ 200 వికెట్ల‌తో రికార్డ్

Share it with your family & friends

ఐపీఎల్ లో తొలి బౌల‌ర్

జైపూర్ – రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఈసారి ఐపీఎల్ 2024లో దుమ్ము రేపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జ‌ట్టు 8 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల‌లో గెలుపొంది 14 పాయింట్ల‌తో టాప్ లో కొన‌సాగుతోంది. ఇక అటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది.

ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన కీల‌కమైన మ్యాచ్ లో రాజ‌స్థాన్ స్పిన్న‌ర్ యుజ్వేంద్ర చాహ‌ల్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఐపీఎల్ లో 200 వికెట్లు సాధించిన తొలి బౌల‌ర్ గా రికార్డ్ సృష్టించాడు. త‌ను హిట్ట‌ర్ రోహిత్ శ‌ర్మ ను అద్భుత‌మైన బంతికి బోల్తా కొట్టించాడు. దీంతో డబుల్ సెంచ‌రీ వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు యుజ్వేంద్ర చాహ‌ల్.

ఇదిలా ఉండ‌గా చాహ‌ల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో చేరాడు. 21.38 స‌గ‌టుతో 153 మ్యాచ్ లు ఆడాడు. 4 వికెట్లు ఆరు సార్లు తీస్తే 5 వికెట్లు నాలుగు సార్లు ప‌డ‌గొట్టాడు. ఇక ఐపీఎల్ లో యుజ్వేంద్ర చాహ‌ల్ త‌ర్వాతి స్థానాల‌లో 183 వికెట్ల‌తో డ్వేన్ బ్రేవో ఉండ‌గా 181 వికెట్ల‌తో పీయూష్ చావ్లా ఉన్నారు. వీరితో పాటు 174 వికెట్లతో భువ‌నేశ్వ‌ర్ కుమార్, 173 వికెట్ల‌తో అమిత్ మిశ్రా చోటు ద‌క్కించుకున్నారు.