హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలి
వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ విడి పోయినా ఆయన ఇంకా దానిపై మమకారం పోనట్టు పేర్కొనడం విడ్డూరంగా ఉంది. విశాఖ పట్టణం ఏపీకి రాజధాని అయ్యేంత దాకా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఇదంతా ఎన్నికలలో భాగంగానే ఆయన ఈ కామెంట్స్ చేశారని, ఒక రకంగా ఓట్లు కొల్లగొట్టేందుకు చేసే ఎత్తుగడ అని మరికొందరు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఏపీలో వైఎస్ జగన్ రెడ్డికి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం ఉంది.
ప్రధానంగా ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మూకుమ్మడిగా పోటీ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఈసారి సర్వేలన్నీ ప్రతిపక్ష కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని, ఈసారి జగన్ రెడ్డి ఆశించిన విధంగా వై నాట్ 175 రావని పేర్కొంటున్నాయి.
ఇదే సమయంలో జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ, కార్ణాటకలో ఆ పార్టీ పవర్ లోకి వచ్చింది. వైఎస్ షర్మిల ఇప్పుడు ఆ పార్టీని నడిపిస్తోంది. గణనీయంగా ఓట్లు చీల్చే ఛాన్స్ లేక పోలేదన్న టాక్ కూడా ఉంది.