కూటమి కుట్రలను తిప్పి కొడతాం
వైసీపీ నేత వైవీ సుబ్బా రెడ్డి కామెంట్
అమరావతి – వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి కుట్రలను తిప్పి కొడతామని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందన్నారు.
కొంతమంది వైసీపీ సింబల్ తో గెలిచిన కార్పొరేటర్లను కూటమి తీసుకున్నా మా ప్రణాళిక మాకుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ తమకున్నా…వాళ్ళు అభ్యర్థులను నిలబెడుతున్నారంటే..వాళ్లు ఏ స్థాయి రాజకీయాలు చేస్తున్నారో అర్థం అవుతుందన్నారు వైవీ సుబ్బారెడ్డి.
కచ్చితంగా ఇటు స్టాండింగ్ కమిటి ఎన్నికల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ సీనియర్ నాయకుడు. జీవీఎంసీ కార్పొరేటర్లతో రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. ఈ తరుణంలో దీని గురించి కూడా చర్చించారు. ప్రస్తుతం పార్టీ చీఫ్, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించారు.