సీఈసీపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
ఫిర్యాదు చేసినా నో రెస్పాన్స్
అమరావతి – వైసీపీ సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసినా పట్టించు కోలేదని ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పోస్టల్ బ్యాలెట్ లో గెజిటెడ్ సంతకం సడలింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం అంతటా ఒక రూల్ ఉంటే ఏపీలో మాత్రం ఈసీ ప్రత్యేక రూల్స్ పెట్టడం దారుణమన్నారు.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ సంతకం లేకుంటే దానిని తిరస్కరించాలనేది రూల్. కానీ ఏపీలో గెజిటెడ్ సంతకం లేక పోయినా అనుమతి ఇస్తున్నారని , ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి.
ఇందుకు సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మీనాకు ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని వాపోయారు . దీనిపై రాష్ట్ర హైకోర్టుకు వెళతామని హెచ్చరించారు.