ఖండించిన సింగర్ జనై భోంస్లే
బాలీవుడ్ సింగర్ జనై భోంస్లే సీరియస్ గా స్పందించారు. తాను హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తో డేటింగ్ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. తను లవర్ కాదని సోదరుడంటూ పేర్కొన్నారు. స్టార్ల వ్యక్తిగత విషయంలో కొంచెం సంయమనం పాటించాలని కోరారు. ఇలాంటివి ప్రచారం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని, తట్టుకోవడం కష్టమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా క్రికెటర్ సిరాజ్ , సింగర్ జనై భోంస్లేలు ఇద్దరూ పూర్తిగా పీకల లోతు ప్రేమలో కూరుకు పోయారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. నిన్నంతా ఇదే హాట్ టాపిక్ గా మారింది.
మరో వైపు జనవరి 23న ముంబైలో గ్రాండ్ గా సింగర్ జనై భోంస్లే పార్టీ జరిగింది. ఈ కార్యక్రమానికి దిగ్గజ గాయనిమణి ఆశా భోంస్లేతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, క్రికెటర్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు మహమ్మద్ సిరాజ్. తను ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరపున ఎంపికయ్యాడు వేలం పాటలో.
ఈ సందర్బంగా జనై భోంస్లే , సిరాజ్ ల మధ్య ఏదో నడుస్తోందంటూ తెగ ప్రచారం ఊపందుకుంది. ఇవాళ దీనిని ఖండించింది ఈ ముద్దుగుమ్మ. అలాంటిది ఏమీ లేదని పేర్కొంది.