ప్రధాన మంత్రి మోడీతో కీలక చర్చలు
ఉక్రెయిన్ – ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశం తమకు అత్యంత మిత్ర దేశమని పేర్కొన్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఫల ప్రదంగా ముగిసిందని చెప్పారు. జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు. తాము కావాలని యుద్దం చేయడం లేదన్నాడు. కానీ తమ వద్ద వనరులపై రష్యా కన్నేసిందని, అందుకే తమను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. మోడీతో జరిపిన చర్చలు కీలకమైనవని పేర్కొన్నారు. ప్రధానంగా రష్యా తన దూకుడు తగ్గించాల్సిన అవసరం ఉందని , ఆ విషయాన్ని తాను పదే పదే మోడీతో ప్రస్తావించడం జరిగిందని చెప్పారు జెలెన్స్కీ.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత దేశమని, ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణను నివారించే సత్తా కేవలం ఇండియాకు మాత్రమే ఉందని పేర్కొన్నారు. గత కొంత కాలం నుంచి వందలాది మంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రష్యా తన దుందుడుకు స్వభావాన్ని విరమించు కోవాలని సూచించారు.
ఇది ఒక వ్యక్తి కోసం జరుగుతున్న యుద్దం కానే కాదన్నారు. పుతిన్ ను నిలువరించే సత్తా ఒకే ఒక్క వ్యక్తి మోడీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు జెలెన్స్కీ.