బెంగళూరులో జీస్ జీసీసీ సెంటర్
భారీ ఎత్తున పెట్టుబడి పెట్టిన సంస్థ
బెంగళూరు – ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన ఆప్టిక్స్, ఆప్టోఎలక్ట్రానిక్స్ సంస్థ జెసిస్ (Zeiss) టెక్ టాలెంట్ పూల్‌లోకి ప్రవేశించింది. అంతే కాకుండా సంస్థ పరిశోధన , అభివృద్ధి (R&D) సామర్థ్యాలను మరింత విస్తరించడానికి బెంగళూరులో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని ప్రారంభించింది.
జర్మనీకి చెందిన సంస్థ తన 43,000 చదరపు అడుగుల సదుపాయంలో 600 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను నియమించు కోవాలని చూస్తోంది. అంతే కాకుండా 2028 నాటికి శ్రామిక శక్తిని రెట్టింపు చేయాలని యోచిస్తోంది.
జీసీసీ (GCC ) అనేది దేశంలోని ఇన్-సోర్స్ ఐటీ, ఇతర సంబంధిత వ్యాపార విధుల కోసం ఏర్పాటు చేసిన ఆఫ్‌షోర్ యూనిట్.
ఈ కేంద్రం తమ పెరుగుతున్న గ్లోబల్ కార్యకలాపాల డిజిటల్ పరివర్తనను వేగవంతం చేస్తుంది. భారతదేశంలో జీస్ వృద్ధికి బలమైన పునాదిని నిర్మించడంలో అచంచలమైన నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తుంది అని జీస్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ధవల్ రాడియా చెప్పారు.
ఈ సంస్థలో 5.5 లక్షల మందికి పైగా నిపుణులు పని చేస్తున్నారని తెలిపారు.