తెలంగాణ సర్కార్ తో ప్రతినిధులు చర్చలు
అమెరికా – తెలంగాణకు మరో కంపెనీ రాబోతోంది. తన కంపెనీని విస్తరించాలని అనుకుంటోంది అమెరికాకు చెందిన జొయిటిస్ ఇంక్ సంస్థ. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు కంపెనీ ప్రతినిధులు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కంపెనీని విస్తరించాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా వరల్డ్ లో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందింది జొయిటిస్ ఇంక్ కంపెనీ. తమ కెపాబులిటీ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచే కార్య కలాపాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జోయిటిస్ ఇంక్ కంపెనీ తమ ప్రాంతాన్ని ఎంచు కోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . తెలంగాణలో కొత్త ఆవిష్కరణలకు, వ్యాపార వృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని అన్నారు.
హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడతాయని చెప్పారు. దీని వల్ల వందలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలో జోయిటిస్ రంగ ప్రవేశం హైదరాబాద్ కు మరింత గుర్తింపు తెస్తుందన్నారు.
ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జోయిటిస్ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు.
తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జోయిటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు. ప్రపంచంతో పోటీ పడే సేవలందించటంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకుంటామని హామీ ఇచ్చారు.