అజ్మీర్ దర్గాకు కేసీఆర్ చాదర్
పంపించిన మాజీ సీఎం
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ కు భక్తి ఎక్కువ. ఆయన అన్ని మతాలను సమానంగా చూస్తారు. అదే లౌకిక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా అజ్మీర్ దర్గాకు చాదర్ ను పంపించడం అలవాటు కేసీఆర్ కు. ఈసారి అధికారాన్ని కోల్పోయారు. బీఆర్ఎస్ సర్కార్ పోయింది. కాంగ్రెస్ కొలువు తీరింది.
ఇదే సమయంలో ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో బాత్రూమ్ లో జారి పడ్డారు కేసీఆర్. ఆస్పత్రిలో కొంత కాలం చికిత్స తీసుకున్నారు. ఇటీవలే నంది హిల్స్ లోని తన ఇంటి వద్దకు వచ్చారు. ఈ సందర్బంగా అజ్మీర్ దర్గాకు స్వయంగా చాదర్ ను పంపించే ఏర్పాటు చేశారు.
మాజీ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆజమ్ అలీ, మత పెద్ద చాదర్ ను కేసీఆర్ కు అందజేశారు. ఆయన చేతుల మీదుగా దీనిని అజ్మీర్ దర్గాకు పంపించనున్నట్లు తెలిపారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం పదిలంగా ఉండాలని ఈ సందర్బంగా మత పెద్ద ప్రార్థనలు చేశారు. తిరిగి ప్రజా క్షేత్రంలోకి వస్తారని , అధికార పార్టీ లొసుగులను ఎండగడతారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎలాగైనా సరే 17 సీట్లు పొందాలని ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ.