NEWSTELANGANA

అన్ని చోట్లా గులాబీ జెండా ఎగ‌రాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ – ఈసారి జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల‌ను క్వీన్ స్వీప్ చేయాల‌ని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. గురువారం హైద‌రాబాద్ లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు.

ఒక్క శాతం తేడాతో మ‌నం అధికారాన్ని కోల్పోవ‌డం జ‌రిగింద‌న్నారు. అయినా కార్య‌క‌ర్త‌లు, నేత‌లు, శ్రేయోభిలాషులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రూ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డాల‌ని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీల‌తో ప్ర‌జ‌లను మోసం చేసింద‌ని ఆరోపించారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాల‌యాప‌న చేస్తున్నార‌ని, ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు రావాల‌ని సూచించారు.

ఎవ‌రూ అధైర్య ప‌డాల్సిన ప‌ని లేద‌న్నారు. పార్టీ అంద‌రి కోసం అండ‌గా నిల‌బ‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఈ స‌మావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మా రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.