Tuesday, April 22, 2025
HomeNEWSఅమిత్ షా రాజీనామా చేయాలి

అమిత్ షా రాజీనామా చేయాలి

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్పీ డిమాండ్

హైద‌రాబాద్ – భార‌త దేశ రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ ను చ‌ట్ట స‌భ‌లో అవ‌మానించేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఆయ‌న వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు ఆరాధ‌కుడైన అంబేద్క‌ర్ ప‌ట్ల చుల‌క‌న భావం క‌లిగి ఉండ‌డం దారుణ‌మ‌న్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌కు డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అంటే ఎంత ఏవ‌గింపు ఉందో అమిత్ షా చ‌ట్ట స‌భ‌లో మాట్లాడిన మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తుంద‌న్నారు. ఇలాంటి వ్య‌క్తుల‌కు ఈ దేశం ప‌ట్ల ప్రేమ ఉంద‌ని ఎలా అనుకోగ‌ల‌మ‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

స్వర్గం ఉందో లేదో ఎవరికీ తెలియ‌దు కానీ కోట్లాది మంది భారతీయుల బానిస సంకెళ్లను తెంచివేసి భూతల స్వర్గాన్ని చూపిన అంబేద్కర్ దేవుడి కంటే ఎక్కువే అన్న విష‌యం అమిత్ షా గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. ముందు అంబేద్క‌ర్ కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల‌ని లేక పోతే పుట్ట‌గ‌తులు లేకుండా పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు ఆర్ఎస్పీ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments