అయోధ్య క్షేత్రం పోటెత్తిన భక్త జనం
శ్రీరాముడి కోసం క్యూ కట్టిన బాంధవులు
అయోధ్య – యూపీలోని అయోధ్యలో రామ మందిరం పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా ముగియడంతో
భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీరాముడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్త బాంధవుల నమ్మకం.
ఈనెల 22న అత్యంత ప్రతిష్టాక్మంగా ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ , సీఎం యోగి ఆదిత్యానాథ్ ఉన్నారు. దేశ వ్యాప్తంగా సినీ, క్రీడా, సాంస్కృతిక, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన 7,000 మంది ప్రముఖులు హాజరయ్యారు. వీరికి ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది శ్రీరామ జన్మ భూమి ట్రస్టు.
ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్వయంగా 1,00,000 లడ్డూల శ్రీవారి ప్రసాదాన్ని అందజేసింది. దేశంలోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనులారా వీక్షించారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రారంభమైన నాటి నుంచి నేటి దాకా 6 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. ఇక భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాలలో ఆలయ ప్రాంగణం కిట కిట లాడుతోంది. మొత్తం రామ మందిరం దేశ ఆత్మ గౌరవానికి చిహ్నం అని పేర్కొన్నారు ప్రధానమంత్రి.