NEWSTELANGANA

ఉత్త‌మ్ రాష్ట్రానికి కాబోయే సీఎం

Share it with your family & friends

ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి

యాదాద్రి జిల్లా – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం కేబినెట్ లో నీటి పారుద‌ల శాఖ మంత్రిగా ఉన్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి ఉత్త‌మ్ అవుతారంటూ బాంబు పేల్చారు.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఏకంగా ఎమ్మెల్యే ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని మంత్రి అని సంబంధించ‌కుండా ఏకంగా ముఖ్య‌మంత్రి గారు అంటూ పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు.

ఇవాళ కాక పోయినా భ‌విష్య‌త్తులో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌ప్ప‌కుండా ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇప్ప‌టికే ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి సీఎం ప‌ద‌వి మిస్ అయ్యిందన్నారు. త‌న నాలుక మీద పుట్టుమ‌చ్చ ఉంద‌ని , తాను ఏది చెబితే అది నిజం అవుతుంద‌ని పేర్కొన్నారు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా రాజ‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇంకా సీఎం రేవంత్ రెడ్డి, ఆయ‌న కోట‌రీ ఇంకా స్పందించ లేదు.