ఎమరాల్డ్ స్వీట్ షాప్ నిర్వాకం
బయట పెట్టిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హైదరాబాద్ – సేంద్రీయ ఉత్పత్తులు వాడాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ నిర్వహిస్తున్న ఎమరాల్డ్ స్వీట్ షాప్ పై ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖ దాడి చేపట్టింది. ఇతర మిఠాయి షాప్ ల కంటే ఎక్కువ ధరలు విక్రయిస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారన్న వైనం బట్ట బయలైంది. శుచీ శుభ్రత లేకుండా టాయిలెట్ల పక్కన దుర్గంధ పూరితమైన వాతావరణంలో ఎమరాల్డ్ దుకాణం కిచెన్ ఉన్నట్లుగా సోదాలో బట్ట బయలైంది.
నిత్యం వందల సంఖ్యలో జనం ఎమరాల్డ్ ఇందిరాపార్క్ వద్ద ఉన్న దుకాణంలో మిఠాయిలు ఇతర తినుబండారాలు తీసుకు వెళ్లడం, సబ్దాన్ కలిపిన ఆవుపాలు సేవిస్తుంటారు.. వీళ్ళ కస్టమర్ల లో ఒకరైన బీసీ మహిళా సంఘం నాయకురాలు మట్టా జయంతి దుకాణానికి వెళ్లి పరిశుభ్రతపై ప్రశ్నించారు..
ఐతే ఆమె పై దాడికి యత్నించిన ఏమరాల్డ్ దుకాణం ప్రతినిధులు దశరథ్, శ్రీనివాస్ రెడ్డి మహిళ అనికూడా చూడకుండా చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలు ఏమరాల్డ్ దుకాణంలోని సీసీ కెమెరాల్లో కూడా నమోదయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దోమల్ గూడ పీఎస్ పోలీసులు నిండితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.