ఏక్ బార్ మోదీ సర్కార్
వాల్ రైటింగ్ కార్యక్రమంలో బండి
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది.
ఇరు తెలుగు రాష్ట్రాలలో పాగా వేయాలని బీజేపీ ప్లాన్ వేసింది. ఈ మేరకు ట్రబుల్ షూటర్ , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా రంగంలోకి దిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు.
ఇందులో భాగంగా ఈనెల 22న అయోధ్య లోని శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. వాల్ రైటింగ్ కార్యక్రమానికి బీజేపీ హై కమాండ్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఆ పార్టీకి చెందిన ఎంపీ, జాతీయ కార్యదర్శి, మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్ పటేల్ గోడలపై ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ రాయడం మొదలు పెట్టారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాబోయే ఎన్నికల్లో మరోసారి ముచ్చటగా పవర్ లోకి రావాలని, ప్రజలంతా కమలాన్ని ఆదరించాలని కోరారు.