ఏపీ కాంగ్రెస్ లో దరఖాస్తుల వెల్లువ
పార్టీకి ఊహించని రీతిలో స్పందన
అమరావతి – ఏపీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా ఉంది. ఎప్పుడైతే మాజీ సీఎం , దివంగత వైఎస్ రాజ శేఖర్ రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిలా రెడ్డి పార్టీ పగ్గాలు తీసుకుందో ఆనాటి నుంచి రాష్ట్రంలో పార్టీ స్పీడ్ పెంచింది. వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికల రంగంలోకి ఎంటర్ అయ్యింది. ఈనెల 23 నుంచి 31 వరకు పర్యటనకు శ్రీకారం చుట్టారు షర్మిల.
ఇదిలా ఉండగా వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు దరఖాస్తు నమూనాను విడుదల చేసింది. స్వయంగా లేదా పార్టీకి చెందిన వెబ్ సైట్ ద్వారా తమ వివరాలతో అప్లై చేసుకోవాలని ఏపీసీసీ కోరింది.
దీంతో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతుండడం విశేషం. ఇదిలా ఉండగా వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న షర్మిల ఉన్నట్టుండి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను కలుసుకున్నారు. ఇద్దరి మధ్య రాష్ట్ర రాజకీయాల గురించి చర్చ జరిగింది.