ANDHRA PRADESHNEWS

ఏపీలో స్కూళ్ల‌కు సెల‌వులు పొడిగింపు

Share it with your family & friends

22న తెరుచుకోనున్న బ‌డులు
అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ప్ర‌క‌టించిన సెల‌వుల‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది.

జ‌న‌వ‌రి 18 వ‌ర‌కు ఇప్ప‌టికే సెల‌వులు ప్ర‌క‌టించింది. అయితే విద్యార్థుల త‌ల్లిదండ్రులు, టీచ‌ర్ల‌ విన్న‌పం మేర‌కు మ‌రో మూడు రోజుల పాటు పెంచిన‌ట్లు పేర్కొంది. జ‌న‌వ‌రి 19, 20, 21 తేదీ వ‌ర‌కు పెంచిన‌ట్లు తెలిపింది. దీంతో తిరిగి బ‌డులు ఈనెల 22న తిరిగి పునః ప్రారంభం అవుతాయ‌ని స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున విద్యా శాఖ క‌మిష‌న‌ర్ ఎస్. సురేష్ కుమార్ ఈ విష‌యాన్ని తెలిపారు అధికారికంగా. ఈ విష‌యాన్ని పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లు గ‌మ‌నించాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా తాము కోరిన వెంట‌నే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంగీక‌రించ‌డం ప‌ట్ల ఏపీలోని పిల్ల‌ల పేరెంట్స్ తో పాటు పంతుళ్లు సైతం ధన్య‌వాదాలు తెలిపారు.

ఎప్ప‌టి లాగే విద్యా రంగంలో ఏపీ రాష్ట్రాన్ని ముందంజ‌లోకి తీసుకు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. కాగా ఏపీ స‌ర్కార్ నాడు నేడు కార్య‌క్ర‌మం ద్వారా కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా వీటిని అభివృద్ది చేసింది.