ANDHRA PRADESHNEWS

క‌లెక్ట‌ర్ డ్యాన్స్ హ‌ల్ చ‌ల్

Share it with your family & friends

చిరంజీవి పాట‌కు స్టెప్పులు

న‌ర్సారావుపేట – ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన వాళ్లు, ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్నం కావాల్సిన ఐఏఎస్ లు రాను రాను గ‌తి త‌ప్పుతున్నారు. ఒక ర‌కంగా త‌మ హ‌ద్దులు మీరుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. తెలంగాణ‌లో ఓ ఐఏఎస్ ఏకంగా ఆనాటి సీఎం కేసీఆర్ కాళ్ల‌కు దణ్ణం పెట్టాడు. స‌ర్వీసులో ఉండ‌గా ఇలాంటి వి చేయ‌కూడ‌దు.

ఒక‌వేళ అలా చేస్తే డిసిప్ల‌న‌రీ యాక్ష‌న్ తీసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇక్క‌డ మాజీ సీఎం , అక్క‌డ ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌న్న అప‌వాదు ఎదుర్కొంటున్నారు.

మితి మీరిన అహంకారం కేసీఆర్ ప‌ద‌వికి చేటు తెచ్చింది. ఆపై అధికారాన్ని కోల్పోయేలా చేసింది. ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఓ క‌లెక్ట‌ర్. ఏకంగా స్టేజిపైకి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమాలోని వేర్ ఈజ్ ది పార్టీ అనే సాంగ్ కు డ్యాన్సు చేశారు. ఆ క‌లెక్ట‌ర్ ఎవ‌రో కాదు శివ శంక‌ర్.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉండాల్సిన క‌లెక్ట‌ర్ ఇలా బహిరంగంగా డ్యాన్స్ చేయ‌డం ఏమిట‌ని ప్ర‌జా సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి.