కాంగ్రెస్ వస్తేనే ఏపీకి ప్రత్యేక హోదా
ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్
అమరావతి – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
ఇకనైనా ప్రజలు మారాలని , పని చేసే వారికి పట్టం కట్టాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిలా రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆమెకు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు. ఇందులో మరో ఆలోచనేది లేదన్నారు. తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే కర్ణాటకలో, తెలంగాణలో కొలువు తీరిన తమ ప్రభుత్వాలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నాయని చెప్పారు షర్మిల.
ఏపీలో ఏడు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాము మాట ఇవ్వమని ఇస్తే తప్పమన్నారు. మూడు రాజధానులు అన్న జగన్ రెడ్డి ఇప్పటి వరకు ఏపీకి ఏది రాజధాని అనేది చెప్పలేక పోవడం దారుణమన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.