కొలువు తీరిన స్మితా సబర్వాల్
ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా
హైదరాబాద్ – ప్రముఖ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమె గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారారు. మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖకు సంబంధించిన శాఖలను చూశారు. ఇదే సమయంలో గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారు. ఒకానొక దశలో ఆమె వ్యవహార శైలిపై ప్రతి ఒక్కరు వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది.
మాజీ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా ఉండడం , కీలకమైన పోస్టులో కొనసాగడం ఒకింత విమర్శలకు దారి తీసింది. తనపై అవుట్ లుక్ పత్రిక దారుణమైన రీతిలో కథనాన్ని ప్రచురించింది. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన ఖర్చును ఆనాటి ప్రభుత్వ ఖజానా నుంచే వెచ్చించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇప్పటి వరకు మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కానీ, సంబంధిత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను కలవలేదు. ఇది పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
ఒకే ఒక రోజు మాత్రమే సచివాలయంలో కనిపించింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా దాసరి సీతక్క పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో మాత్రమే తళుక్కున మెరిసింది. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు స్మితా సబర్వాల్ కు . ఆమెను ఆర్థిక శాఖ సభ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇవాళ తన పోస్టులో కొలువు తీరారు. ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.