చాదర్ ను సమర్పించిన సీఎం
అజ్మీర్ షరీఫ్ దర్గాకు
న్యూఢిల్లీ – సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు రాష్ట్ర పాలనపై ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా మరింత బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతున్నారు.
తాజాగా రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఉరుస్ – ఎ – షరీఫ్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్ – ఇ- చాదర్ ను స్వయంగా సీఎం అందించారు.
రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అప్పులు తీరి అభివృద్ది పథంలో నడవాలని తాను కోరుకున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేశారు. మరో వైపు కీలక సమీక్షలు చేపట్టారు.