జగన్ పాలనలో దొంగ ఓట్లు
నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్
అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వంపై , సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ తో పాటు బృందాన్ని కలుసుకున్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా హాజరై వినతిపత్రాలు సమర్పించారు.
సీఈసీని కలిసిన అనంతరం జనసేన పార్టీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. జగన్ వచ్చాక దౌర్జన్యం పెరిగిందన్నారు. అంతే కాదు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ దొంగ ఓట్లు నమోదు చేయించారంటూ తీవ్ర విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్.
ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో సగానికి పైగా ఓట్లు ఆమోదం కూడా పొందాయని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి సీఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. వైసీపీ పవర్ లోకి వచ్చాక అక్రమ కేసులు మరింత పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు .