ANDHRA PRADESHNEWS

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు శాపం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన నాదెండ్ల మ‌నోహ‌ర్

తెనాలి – జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో కొలువు తీరిన జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ల్ల సామాన్యుల‌కు ఒరిగింది ఏమీ లేద‌న్నారు. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

సామాన్యుల‌కు 13 సార్లు క‌రెంట్ షాక్ కొట్టిన ఘ‌న‌త జ‌గ‌న్ రెడ్డికే ద‌క్కుతుంద‌న్నారు. వైసీపీ పాల‌నను చూసి బెంబేలెత్తి పోతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. క‌క్ష క‌ట్టి పాల‌న సాగించార‌ని ఆరోపించారు నాదెండ్ల మ‌నోహ‌ర్.

రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం జ‌న‌సేన‌, టీడీపీ పొత్తును ప్ర‌జ‌లు అర్థం చేసుకుని స‌హ‌క‌రించాల‌ని కోరారు. తెనాలి నియోజ‌క‌వ‌ర్గం అన్ని రంగాల‌లో వెనుక‌బాటుకు లోనైంద‌న్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని జ‌నం భ‌రించే స్థితిలో లేర‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను పూర్తిగా నిర్వీర్యం చేశార‌ని ఆరోపించారు.

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టించారంటూ జ‌గ‌న్ పై ధ్వ‌జ‌మెత్తారు నాదెండ్ల మ‌నోహ‌ర్. త‌మ కూట‌మి ఈసారి క‌చ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.