జనం లోకి జన సేనాని
జనవరి నెలాఖరు నుంచి ప్రచారం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి. వైసీపీ చీఫ్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల నగారా మోగించారు. చాలా మంది సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వలేదు. ఇదే సమయంలో ఈసారి ఎలాగైనా సరే జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
ఆయన ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిరం పుణః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆయనకు ప్రత్యేకంగా శ్రీరామ మందిరం ట్రస్టు నుంచి ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా ఏపీకి వస్తారని జనసేన పార్టీ తెలిపింది.
ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్లాన్ చేసింది పార్టీ. ఇందులో భాగంగా ఈనెలాఖరు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పేర్కొంది. ఈసారి జనసేన ఒంటరిగా పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రచారం చేపట్టనుంది. అయితే ఇరు పార్టీలకు సంబంధించి ఇంకా సీట్లు ఖరారు కాలేదు.
మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సైతం తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠగా మారింది.