ప్రశంసించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ – ఎవరీ జయలక్ష్మి అనుకుంటున్నారా. కేరళకు చెందిన యువతి. ఆమెకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. కానీ అందరి లాగా ఎరువులు, మందులు ఉపయోగించకుండా సాగు చేయడం అలవాటు చేసుకుంది. యువత విలువైన సమయాన్ని నిర్వీర్యం చేస్తుంటే ఆమె మాత్రం పొలం పనుల్లో నిమగ్నమైంది. అంతే కాదు మొక్కలు, చెట్లను నాటడం మొదలు పెట్టింది.
ఇదిలా ఉండగా కేరళను సందర్శించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా. ప్రముఖ మలయాళ సినీ రంగానికి చెందిన దిగ్గజ నటుడు సురేష్ గోపి పెద్ద కూతురు పెళ్లికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నరేంద్ర మోదీ. ఆయన సమక్షంలోనే వివాహం జరగడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సురేష్ గోపి బీజేపీ తరపున మాజీ ఎంపీగా ఉన్నారు. ఇదిలా ఉండగా సేంద్రీయ వ్యవసాయం పట్ల ఎంతో మక్కువ కలిగిన జయలక్ష్మి స్వతహాగా తాను పెంచిన మొక్కను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా అందజేసింది. రెండేళ్ల కిందట జామ మొక్కను నాటింది. దానిని తనకు ఇచ్చిందని ఈ సందర్బంగా ఆనందాన్ని పంచుకున్నారు మోదీ.