టీడీపీ..జనసేనతో బీజేపీ కలవాలి
సూచించిన హరి రామ జోగయ్య
అమరావతి – ప్రముఖ కాపు సామాజిక నేత హరి రామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సమీకరణలు మారుతున్నాయి. ప్రస్తుతానికి తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఇదే విషయాన్ని ఆ రెండు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారు.
తాజాగా హరి రామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్ ఉంది. అయితే ఒంటరిగా పోటీ చేయడం వల్ల లాభం లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు హరి రామ జోగయ్య.
తెలుగుదేశం, జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ కలవాలని పిలుపునిచ్చారు. దీని వల్ల కొంత మేరకు ఓటు బ్యాంకు చీలి పోయేందుకు ఆస్కారం ఉండదన్నారు. ఇక పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కనీసం 40 నుంచి 60 సీట్లు తీసుకోవాలని సూచించారు. దీని వల్ల కొంత పట్టు దొరికేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు హరిరామ జోగయ్య.