డీజీసీఏ సంచలన నిర్ణయం
విమానాల ఆలస్యంపై రూల్స్
న్యూఢిల్లీ – విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ). ఈ మేరకు తాజాగా ప్రకటించిన ఉత్తర్వులలో విమాన ప్రయాణీకులకు మరింత మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది.
విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి డీజీసీఏ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను జారీ చేసింది తాజాగా. ఒకవేళ విమానాలు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ ఫైట్ ను ఎయిర్ లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు వీలు కల్పించింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది డీజీసీఏ. ఎయిర్ పోర్టుల వద్ద ఈ మధ్య విపరీతమైన రద్దీ ఏర్పడింది. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. రద్దీ నియంత్రణ, ప్రయాణీకులకు వీలైనంత మేరకు అసౌకర్యం కలగకుండా చూడడం లక్ష్యంగా కొన్ని మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది.
ఒకవేళ విమానం గనుక రద్దయితే ఎయిర్ పోర్టుల్లో ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సదరు ఎయిర్ లైన్స్ పై ఉంటుందని పేర్కొంది.
అయితే విమానం రద్దయితే విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
విమాన టిక్కెట్లపై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ను ముద్రిస్తారు. ఈ మధ్య పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలకు సంబంధించి ప్రయాణికుల నుంచి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో డీజీసీఏ ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.