NEWSTELANGANA

తెలంగాణ వార్షిక బ‌డ్జెట్ పై స‌మీక్ష

Share it with your family & friends

రివ్యూ చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం దూకుడు పెంచింది. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన వార్షిక బ‌డ్జెట్ కు సంబంధించి స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో రాష్ట్ర రెవిన్యూ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ఆర్ధిక ముఖ్య కార్య‌ద‌ర్శి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు.

వార్షిక బ‌డ్జెట్ లో ఏయే రంగాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే దానిపై విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి విద్య‌, వైద్య, ఉపాధి రంగాల‌కు ప్ర‌యారిటీ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు కూడా పాల్గొన్నారు.

ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా రెవెన్యూ, గృహ నిర్మాణం, పంచాయ‌తీరాజ్ , టెక్స్ టైల్ , హార్టి క‌ల్చ‌ర్ , వ్య‌వ‌సాయం , మార్కెటింగ్ , చేనేత‌, స‌హ‌కార శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే గ‌త ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసింది. అప్పులు మిగిల్చింది. దీనిని పూడ్చేందుకు నానా తంటాలు ప‌డుతోంది రేవంత్ రెడ్డి స‌ర్కార్.