NEWSTELANGANA

తెలంగాణ‌కు ప‌ద్మ పుర‌స్కారాలు

Share it with your family & friends

ఐదుగురిని ఎంపిక చేసిన కేంద్రం

హైద‌రాబాద్ – కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పౌర పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ప‌ద్మ విభూష‌ణ్ , ప‌ద్మ భూష‌ణ్ , ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను వెల్ల‌డించింది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌లోని వివిధ రంగాల‌కు చెందిన వారిని ఎంపిక చేసింది.

75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా అత్యంత ప్ర‌తిష్టాక్మంగా భావించే పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించ‌డం విశేషం. ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రి , న‌టుడు చిరంజీవిలను ఎంపిక చేసింది.

ఇక తెలంగాణ‌కు చెందిన ఐదుగురికి ప‌ద్మ‌శ్రీ అవార్డులు ద‌క్కాయి. నారాయ‌ణ‌పేట జిల్లా దామ‌ర‌గిద్ద‌కు చెందిన బుర్ర వీణ వాయిద్య‌కారుడు దాస‌రి కొండ‌ప్ప‌, జ‌న‌గాంకు చెందిన య‌క్ష గాన క‌ళాకారుడు గ‌డ్డం స‌మ్మ‌య్య‌, స్త‌ప‌తి ఆనందాచారి, విద్య‌,సాహిత్య రంగాల‌లో బంజారా గాయ‌కుడు కేతావ‌త్ సోంలాల్ , ప‌ద్య క‌వి కూరెళ్ల విఠ‌లాచార్య‌ల‌ను ఎంపిక చేసింది.