దర్శకుడు ఓం రౌత్ వైరల్
అయోధ్యలో హల్ చల్
అయోధ్య – యావత్ లోకమంతా ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన అద్బుత , అపూర్వమైన ఘట్టం అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవంతో ఆవిష్కృతమైంది. కోట్లాది మంది ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించారు. ప్రధాన మంత్రి మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రామ జన్మ భూమి ట్రస్టు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ఎక్కడ చూసినా దేశ వ్యాప్తంగా జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది. ముస్లిం మత పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రస్టు దేశంలోని 7,000 మంది ప్రముఖులను ఆహ్వానించింది. ఇందులో సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన వారున్నారు.
ఇదిలా ఉండగా ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కారణం ఆయన డార్లింగ్ ప్రభాస్ , కృతీ సనన్ తో సినిమా తీశాడు. అది హిట్ గా నిలిచింది. ఇదే సమయంలో కొంత వివాదాస్పదానికి కూడా గురయ్యారు. కృతీ సనన్ ను తిరుమల పుణ్య క్షేత్రం సాక్షిగా ఓం రౌత్ ముద్దు పెట్టుకున్నారు. దీనిపై టీటీడీ వివరణ కోరింది.