NATIONALNEWS

దేవ‌రాను కోల్పోవ‌డం పార్టీకి న‌ష్టం

Share it with your family & friends

శివ‌సేన అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్
ముంబై – శివ‌సేన బాల్ థాక‌రే పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం క‌లిగిన మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవ‌రా రాజీనామా చేయ‌డంపై తీవ్రంగా స్పందించారు. ఇండియా కూట‌మిలో కాంగ్రెస్ తో పాటు శివ‌సేన బాల ఠాక్రే పార్టీ కూడా భాగ‌మై ఉన్నాయి.

ఈ సంద‌ర్బంగా ఆదివారం సంజ‌య్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం బీజేపీకి, మోదీ ప‌రివారానికి వ్య‌తిరేకంగా కూట‌మి పోరాడుతోంద‌ని , ఈ స‌మ‌యంలో వారి పంచ‌న చేరేందుకు రాజీనామా చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

మిలింద్ దేవ‌రాకు అపార‌మైన అనుభ‌వం ఉంద‌న్నారు. కానీ ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో పార్టీని వీడ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు సంజ‌య్ రౌత్. కాంగ్రెస్ పార్టీ మిలింద్ కు ప్ర‌యారిటీ ఇచ్చింది, ప‌లు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింద‌న్న విష‌యం మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా మిలింద్ దేవ‌రా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నాన‌ని, త‌న‌కు బాధ‌గా ఉంద‌ని, అయినా వెళ్లిపోక త‌ప్ప‌ద‌న్నారు. సీఎం ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని శివ‌సేన పార్టీలో చేర‌నున్న‌ట్లు టాక్.