ANDHRA PRADESHNEWS

నేను సంబురాల రాంబాబును

Share it with your family & friends

సంక్రాంతి పండుగ‌లో హ‌ల్ చ‌ల్
అమ‌రావ‌తి – ఏపీలో సంక్రాంతి పండుగ‌ను అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుపుకుంటున్నారు. వైసీపీ బాస్ , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భార్య భార‌తి పండుగ వేడుక‌ల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు, ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు వారంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

పండుగ అనేది ఏడాదికి ఒక‌సారే వ‌స్తుంద‌ని ఈ సంద‌ర్బంగా అన్నారు ఏపీ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు. సంక్రాంతికి తాను సంబురాల రాంబాబునేన‌ని, అయితే పండుగ దాటికే పొలిటిక‌ల్ రాంబాబు నంటూ స్ప‌ష్టం చేశారు.

సంబురాల‌లో ఎంత బాగా పాల్గొంటానో సీరియ‌స్ గా పాలిటిక్స్ లో పాలు పంచుకుంటాన‌ని పేర్కొన్నారు అంబ‌టి రాంబాబు. స‌త్తెన‌ప‌ల్లిలో ప్ర‌తి కుటుంబం సంక్రాంతిని ఘ‌నంగా జ‌రుపు కోవాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని పేర్కొన్నారు.

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఏపీలో త‌మ స‌ర్కార్ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన క‌లిసి ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా, ఎన్ని హామీలు ఇచ్చినా జ‌నం వారిని న‌మ్మే స్థితిలో లేర‌న్నారు అంబ‌టి రాంబాబు. తాము క‌చ్చితంగా గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.