NEWSTELANGANA

ప‌నే దైవం జ‌న‌మే ముఖ్యం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన స్మితా స‌బ‌ర్వాల్

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎవ‌రిని అడిగినా ఇట్టే చెప్పేసే ఏకైక ఆఫీస‌ర్ ఎవ‌రైనా ఉన్నారంటే ఆమె స్మితా స‌భ‌ర్వాల్ మాత్ర‌మే. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఎల్ల‌ప్పుడూ వైర‌ల్ గా ఉండేందుకు ఇష్ట ప‌డుతుంది. త‌న‌కు సంబంధించిన అన్ని విష‌యాల‌ను పంచుకుంటుంది. దీంతో ఇటు ట్విట్ట‌ర్ అటు ఇన్ స్టా, ఫేస్ బుక్ మాధ్య‌మాల‌లో టాప్ లో నిలిచింది.

గ‌త ప్ర‌భుత్వంలో ఒక వెలుగు వెలిగిన స్మితా స‌భ‌ర్వాల్ ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్ర ఆర్థిక శాఖ‌కు బ‌దిలీ అయ్యింది. తాను కేంద్ర స‌ర్వీసులోకి వెళ‌తాన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది కూడా. కానీ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఆమె తాను ఎక్క‌డికీ వెళ్ల‌డం లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. అంతే కాదు తాను ప్ర‌జ‌ల మ‌నిషిన‌ని, ఎవ‌రికీ లొంగే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు స్మితా స‌భ‌ర్వాల్.

ప్ర‌స్తుతం త‌న‌కు అప్ప‌గించిన ప‌ద‌విలో కొలువు తీరిన ఆమె నిత్యం ప్ర‌జ‌ల‌ను క‌లిసే ప‌నిలో నిమ‌గ్నమై పోయారు. మొత్తంగా తాను జ‌నం మ‌నిషిన‌ని నిరూపించుకున్నారు. భారీ ఎత్తున త‌ర‌లి వ‌స్తుండ‌డం త‌న‌ను మ‌రింత సంతోషానికి గురి చేస్తోంద‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు స్మితా స‌భ‌ర్వాల్.