పరుగులు పెట్టిస్తున్న ఆర్ వీ కర్ణన్
హోటళ్లు..రెస్టారెంట్స్ ఓనర్స్ కు షాక్
హైదరాబాద్ – నిన్నటి దాకా ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖ అనేది ఒకటి ఉందనేది ఎవరికీ తెలియని పరిస్థితి. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఆరోగ్య శాఖ పరిధిలోని ఈ శాఖకు ఓ ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనే ఆర్వీ కర్ణన్. గతంలో పలు జిల్లాల్లో కలెక్టర్ గా పనిచేశారు. తను ఎక్కడ పని చేసినా తనదైన ముద్ర కనబర్చారు.
తాజాగా ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖకు వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే సదరు శాఖలో కదలికలు ప్రారంభం అయ్యాయి. ఎక్కడ చూసినా హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలలో తనిఖీలు ముమ్మరం అయ్యాయి. ఇందుకు శ్రీకారం చుట్టిన ఘనత కర్ణన్ దే.
నగరంలో పేరు పొందిన హొటళ్లు, రెస్టారెంట్లు, ఇతర తిను బండారాలను అమ్మే వారికి ఝలక్ ఇస్తున్నారు. ఫుడ్ అండ్ సేఫ్టీకి చెందిన బృందాలు పెద్ద ఎత్తున తనిఖీలు, సోదాలు చేపడుతూ చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో ఎప్పుడు వస్తారో , ఎప్పుడు దాడులకు దిగుతారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇదే సమయంలో హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ కొలువు తీరిన మాల్స్ లో సైతం దాడులు ముమ్మరం చేశారు. దీంతో ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖ అంటే జడుసుకుంటున్నారు సదరు హోటళ్లు, రెస్టారెంట్స్ , బార్ల , చిన్న షాపుల ఓనర్లు ఆందోళనకు గురవుతున్నారు.
మెస్ లు , పబ్ లు , బార్లు, క్లౌడ్ కిచెన్లు, స్ట్రీట్ వెండర్లు, పార్శిళ్ల ద్వారా నిత్యం వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. రుచి సరే కానీ శుభ్రత , నాణ్యత పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆర్వీ కర్ణన్ బాధ్యతలు చేపట్టాక సీన్ మారింది.
పేరు పొందిన బిగ్ హొటళ్లలో సైతం దారుణమైన పరిస్థితి నెలకొనడంతో తిన్న వారంతా విస్తు పోతున్నారు. దీంతో పరిశుభ్రత పాటించేందుకు ప్రయారిటీ ఇస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా ఆర్వీ కర్ణన్ గత ఏప్రిల్ 16 నుంచి తన చర్యలకు శ్రీకారం చుట్టారు. పేరు పొందిన ప్యార డైజ్ , పిస్తా హౌజ్ , బాస్కిన్ రాబిన్స్ , రామేశ్వరం కేఫ్ , బాహుబలి కిచెన్ ఇలా ప్రతి దానిని వదలలేదు.
కాగా కర్ణన్ ది స్వస్థలం తమిళనాడు లోని శివగంగా జిల్లా కరైకుడి. 2007లో ఐఏఎస్ టాపర్ గా ఎంపికయ్యాడు. మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల కలెక్టర్ గా పని చేశాడు. తన భార్య ప్రియాంక కూడా ఐఏఎస్ కావడం విశేషం.