ANDHRA PRADESHNEWS

పవన్ కల్యాణ్‌తో రాయుడు భేటీ

Share it with your family & friends

గంట పాటు జ‌న‌సేనానితో చ‌ర్చ

అమ‌రావ‌తి – భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు మరోసారి చ‌ర్చనీయాంశంగా మారారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో త‌ను పోటీ చేయాల‌ని అనుకున్నారు. ఆ వెంట‌నే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు.

వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఆ వెంట‌నే ఏమైందో ఏమో కానీ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆలోచ‌న లేద‌ని, ప్ర‌స్తుతం దుబాయ్ లో జ‌రిగే లీగ్ పోటీల‌లో పాల్గొనాల్సి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఊహించ‌ని రీతిలో త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి లోని జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి చేరుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గంట పాటు చ‌ర్చించారు.

గంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గం లేదంటే కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ టికెట్ ఆశిస్తున్నార‌ని స‌మాచారం. వైసీపీలో చేరిన అంబ‌టి రాయుడు 10 రోజుల‌కే దానిని వీడారు. క్రికెట‌ర్ గా గుర్తింపు పొందినా జాతీయ జ‌ట్టులో సుదీర్ఘ కాలంగా ఆడ‌లేక పోయాడు . తాను క్రికెట్ కు వీడ్కోలు చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆ త‌ర్వాత మాట మార్చాడు.

తిరిగి క్రికెట్ ఆడ‌తానంటూ తెలిపాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే అంబ‌టి రాయుడు ఒక ప‌ట్టాన తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండ‌ర‌న్న ప్ర‌చారం ఉంది. ఈ పార్టీలో ఎంత కాలం ఉంటాడో వేచి చూడాలి.