పైనాపిల్స్ కు మేఘాలయ కేరాఫ్
ఆ రుచి వేరంటున్న రాహుల్ గాంధీ
మేఘాలయ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రస్తుతం మేఘాలయలో ఉన్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నం చేశారు.
గతంలో తమిళనాడు నుంచి కాశ్మీర్ దాకా చేపట్టిన తొలి విడత భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను విన్నారు. వారు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. తమను ఆదరిస్తే మీకు మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తాజాగా ప్రజల గొంతును వినిపించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం రాహుల్ గాంధీ వైరల్ గా మారారు. ఆయన పళ్లు అమ్మే పండ్ల దుకాణం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వారితో పైనాపిల్స్ తీసుకున్నారు. వాటికి ధర అడిగి చెల్లించారు. ఈ సందర్బంగా పండ్ల దుకాణం దారుడితో ముచ్చటించారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా రాహుల్ గాంధీ షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాహుల్ ఫోటోలు వైరల్ గా మారాయి.