ENTERTAINMENT

ప్ర‌భాస్ ది రాజా సాబ్

Share it with your family & friends

న్యూ లుక్ పోస్ట‌ర్ అదుర్స్

పాన్ ఇండియా సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్ నుంచి మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌లార్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లు కొల్ల‌గొట్టింది.

ఈ త‌రుణంలో త‌దుప‌రి చిత్రంపై ఉత్కంఠ‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు మారుతి. ఈ మేర‌కు సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌భాస్ తో తాను తీయ‌బోయే చిత్రానికి ది రాజా సాబ్ అని పేరు పెట్టిన‌ట్లు తెలిపాడు. సోష‌ల్ మీడియా సాక్షిగా ఈ కొత్త చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు మారుతి.

ఈ మూవీ పూర్తిగా ఆక‌ట్టుకునేలా, అంద‌రినీ అల‌రించేలా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు హామీ ఇచ్చారు. రొమాంటిక్, హార‌ర్, ఎంట‌ర్ టైన‌ర్ గా తీర్చి దిద్దుతాన‌ని స్ప‌ష్టం చేశాడు డైరెక్ట‌ర్. ఈ సంద‌ర్భంగా న‌టుడు ప్ర‌భాస్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

నా మ‌న‌సులో ఉన్న వాటిని ముందుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళితో పంచుకుంటాన‌ని అన్నారు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ది రాజా సాబ్ లో న‌టిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి రోజూ పండ‌గే, ప్రేమ‌క క‌థా చిత్రమ్ లాంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు మారుతి.