ఫాక్స్ కాన్ సిఇఓకు పద్మ భూషణ్
ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ – కేంద్ర ప్రభుత్వం అత్యున్నతమైన పద్మ పురస్కారాలను ఎంపిక చేసింది. మొత్తం 132 మందిని ఎంపిక చేసింది. 5 గురికి పద్మ విభూషణ్ , 17 మందికి పద్మ భూషణ్ , 105 మందికి పద్మశ్రీ అవార్డులు వరించాయి.
ఇందులో ఊహించని రీతిలో కేంద్ర సర్కార్ ప్రముఖ కంపెనీ ఫాక్స్ కాన్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) యంగ్ లియు ను పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. నాలుగు దశాబ్దాలుకు పైగా పరిశ్రమ అనుభవం ఉంది.
ఈ పురస్కారం దేశంలోనే అత్యున్నతమైన అవార్డుగా పరిగణిస్తారు. తైవాన్ కు చెందిన వ్యక్తి యంగ్ లియు. ఆయన మూడు కంపెనీలను ఏర్పాటు చేశారు. 1988లో యంగ్ మైక్రో సిస్టమ్స్ ను స్థాపించాడు. ఇది మదర్ బోర్డును తయారు చేసింది.
1995లో ఐసీ డిజైన్ కంపెనీ పీసీ చిప్ సెట్ పై దృష్టి సారించారు. 1997లో ఐటీఈ టెక్ కంపెనీని ఏర్పాటు చేశారు. 70 శాతం ఐఫోన్ లను సమీకరించే ప్రపంచం లోనే అతి పెద్ద కాంట్రాక్ట్ తయారీదారుగా ఉంది తైవాన్ కంపెనీ.