NEWSTELANGANA

బీఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌జా ధ‌నం లూటీ

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఆకునూరి ముర‌ళి

హైద‌రాబాద్ – సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫోర‌మ్ (ఎస్డీఎఫ్) క‌న్వీన‌ర్, మాజీ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. గురువారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధానంగా గ‌త కొంత కాలం నుంచి ఆకునూరి ముర‌ళి ప్ర‌జ‌ల త‌ర‌పున మాట్లాడుతున్నాడు.

అంతే కాకుండా ఏపీలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా గుడ్ బై చెప్పారు. కానీ అక్క‌డ విద్యా రంగంలో సంస్క‌ర‌ణ‌లు తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. అంతే కాదు ఏపీలో కార్పొరేట్ స్కూళ్ల‌కు ధీటుగా తీర్చిదిద్దేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు ఆకునూరి ముర‌ళి.

ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే జాగో తెలంగాణ పేరుతో చాలా ప్రాంతాలు ప‌ర్య‌టించారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న మోసాన్ని, గులాబీ నేత‌ల గూండా గిరీని, అవినీతి, అక్ర‌మాల‌ను, క‌బ్జాల‌ను , కేసుల గురించి త‌న వాయిస్ వినిపించారు. ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంట్లో ఫ‌ర్నీచ‌ర్ కి రూ. 25 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం, కుక్క‌ల షెడ్డు కోసం రూ. 12 ల‌క్ష‌లు వెచ్చించ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ప్ర‌జా ధనాన్ని లూటీ చేశారంటూ ఆరోపించారు ఆకునూరి ముర‌ళి.