మిలింద్ దేవరా రాజీనామా
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
ముంబై – సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు. 55 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా తాను వీడుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆయన ముంబై న ఉంచి లోక్ సభ సీటు ఆశిస్తున్నారు.
అయితే మిలింద్ దేవరా ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని శివ సేన పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. మంచి పట్టుంది మరాఠాలో మిలింద్ దేవరాకు.
ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు . ఇవాళ నా రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసిందన్నారు. పార్టీతో సుదర్ఘ అనుబంధానికి తెర పడిందన్నారు.
ఇన్నేళ్లుగా తనకు సహకరించిన పార్టీ పెద్దలు, నేతలు, అభిమానులకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. అయితే తాను శివ సేన ఎంబీటీ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు.